🔹 అమావాస్య సందర్భంగా మహా అన్నప్రసాదం
🔹 వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో భక్తులకు వితరణ
🔹 జీడిమెట్ల దుర్గామాత గుడి వద్ద కార్యక్రమం
🔹 550 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేత
🔹 ప్రముఖులు, సంఘం సభ్యులు పాల్గొనడం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 23హైదరాబాద్:
జీడిమెట్ల గాంధీ విగ్రహం సమీపంలోని దుర్గామాత ఆలయం వద్ద శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి సేవాదళ్ సుచిత్ర – కొంపల్లి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంలో 550 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది. సంఘం సభ్యులు పడకంటి వెంకటేశం, తోట బిక్షపతి, పల్ల నాగరాజు, ఉప్పల నాగరాజు, దొంతుల శ్రీనివాస్, చిటిమెల శ్రీనివాసు, పప్పుల ఎల్లయ్య, తమ్మి వీరేశం, డాక్టర్ కటకం బాలేశం, ముస్ట్యాల సంతోష్ కుమార్, ఆధారపు కృష్ణమూర్తి, తాటిపాముల రమేష్, చీల రాము, ముప్పిరిశెట్టి కిష్టయ్య, కాశంకటకం బాలేషం, నాగేశ్వరరావు, సందీప్, పవన్ కుమార్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కటకం బాలేశం విచ్చేసి సేవాదళ్ నిర్వహించిన సాంఘిక సేవను అభినందించారు.