*బాల వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ- ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*
బాలవికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ – హన్మకొండ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సౌజన్యంతో జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందనిలక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు నిక్కత 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపించేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన డాక్టర్ నిక్కత మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని నీటిని మురికి గుంటల్లో నిలువ ఉంచరాదని ప్లాస్టిక్ పైపు ముక్కలను చెత్తాచెదారాన్ని ప్లాస్టిక్ బాటిల్లను మురికి కాలువల్లో వేయరాదని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్ నిక్కత, బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, పి ఆర్ ఓ సుభాష్,పాషా, సిస్టర్లు ప్రసన్న, కృష్ణవేణి బాలవికాస కోఆర్డినేటర్లు కే సుమలత, ఎ స్వాతి, పంచాయతీ కార్యదర్శి రంజిత్, కారోబార్ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.