పదవి విరమణ.. రిమార్కు లేకుండా గొప్ప సేవ
ఎలాంటి రిమార్కు లేకుండా రిటైర్ కావడం గొప్ప విషయం: సీపీ సాయి చైతన్య
పోలీస్ శాఖలో సేవలందించిన ఎల్లయ్య గౌడ్, తాళ్ళ నర్సింలు, యాకూబ్ రెడ్డి రిటైర్మెంట్
శాలువాలు కప్పి, శుభాకాంక్షలతో సత్కరించిన కమిషనర్
“మీ సేవలు మరువలేనివి” అంటూ ప్రశంసించిన సీపీ
భవిష్యత్తులో కూడా అవసరమైతే సహాయం అందిస్తామని హామీ
నిజామాబాద్, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం):
ఎలాంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ చేయడం ప్రతి ఉద్యోగి జీవితంలో గర్వకారణమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
శనివారం పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో వీఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. ఎల్లయ్య గౌడ్, సీసీఆర్‌బీలో ఎస్సై తాళ్ల నర్సింలు, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఎల్. యాకూబ్ రెడ్డి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో మాట్లాడిన సీపీ సాయి చైతన్య, “పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజం. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం అత్యంత గౌరవనీయమైన విషయం. మీరు విభాగానికి అందించిన సేవలు మరువలేనివి” అన్నారు.
భవిష్యత్తులో అవసరం అయితే తామంతా తోడుంటామని హామీ ఇచ్చిన ఆయన, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్ అహ్మద్, షకీల్ పాషా తదితరులు, రిటైర్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.