*వడాయిగూడెం గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు*
*ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేత*
యాదాద్రి భువనగిరి, జనవరి 15
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో బుధవారం రోజు దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ నేతృత్వంలో గ్రామ బొడ్రాయి సెంటర్ లో ఘనంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన ఎరుకల ప్రవళిక మొదటి బహుమతిగా 9 వేల రూపాయలు గెలుపొందగా , రెండవ బహుమతిగా 6 వేల రూపాయలను కోట సత్యమ్మ , మూడవ బహుమతిగా కావ్య రంజిత్ 3 వేల రూపాయలను బహుమతులను టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు సుమారు 500 రూపాయల విలువగల చీరలను అందజేశారు.గ్రామ బొడ్రాయి సెంటర్లో గంగిరెద్దులతో డోడు బసవన్నలు సయ్యాటలాడారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి ముత్తయ్య గౌడ్ మాట్లాడుతూ వడాయీగూడెం గ్రామంలో గత పది సంవత్సరాలుగా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని , పోటీలలో గెలుపొందిన వారికి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను ఈ సంవత్సరం కూడా అందజేయడం జరుగుతుందన్నారు. మరియు కౌన్సులేషన్ బహుమతుల క్రింద 10 మందికి ప్రెషర్ కుక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గ్రామంలో అనేక కార్యక్రమాలతో పాటు బొడ్రాయి సెంటర్లో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగు తుందన్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగిందన్నారు. గ్రామ మహిళలు ఇంతే ఆదరణతో భవిష్యత్తులో దుర్గామాత ఉత్సవ కమిటీ నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ , సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బబ్బురి సురేష్ , దుర్గామాత ఉచ్చ కమిటీ అధ్యక్షులు బబ్బురి సుమన్, గ్రామ మాజీ సర్పంచ్ కోట పెద్ద స్వామి,ఎమ్మార్పీఎస్ నాయకులు , నోముల నరసింహ (సీఈవో) , గ్రామ మాజీ వార్డు సభ్యులు , మాజీ కోఆప్షన్ సభ్యులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.