Site icon PRASHNA AYUDHAM

అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు…

అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు..

భోజనము అంటే సంపూర్ణఆహారం. శరీరానికి కావలసిన విటమిన్స్,కాలరీస్,కొవ్వుపదార్ధాలు,మాంసకృత్తులు, ఖనిజ లవణాలు మొదలైనవి సమకూరేలా వివిధమైన ఆహార పదార్ధాలతో కూడినదే భోజనము నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. “అన్నం పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! …. ఎంతయినా అమ్మ అంటే అన్నం. …. అన్నం అంటే అమ్మ ! అంతే !

( జంధ్యాల గారు )

మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం – సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ  ) .

రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! … వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య  ) .

ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ  ) .

ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా ” మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి పని చేస్తేనే ఇవి మన ఇంటి వరకు వచ్చాయి.. అని బీదసాదలకి ధాన్యం చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు !

( ఆచార్య ఆత్రేయ గారు )

అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

 

ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ  పల్చని నీళ్ళ చారు కూడా అమృతంలా రుచిస్తుంది మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు …. మీ పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి.. ఎంతటి మంచి వాక్యాలు. ? తమ అనుభవ సారాన్ని మనకి పంచిన పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం !!

Exit mobile version