గ్రేటర్ హైదరాబాద్ హిందూ స్మశాన వాటిక నూతన కమిటీ ఎన్నిక
ప్రశ్న ఆయుధం మే06: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి: తెలంగాణ మాల బ్యాగరి కాటికాపరి స్మశానవటికల సంఘం, పాపిరెడ్డి కాలనీ రోడ్ హిందూ స్మశానవాటిక ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బ్యాగరి రాజు ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ రెండు సంవత్సరాలు పూర్తిఅయినందున గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎత్తపు కేశవులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య విచ్చేసారు. వారి సమక్షంలో నూతన కమిటీ సభ్యులుగా, వెంకట స్వామి సదానందం, సురేందర్, నాగరాజు, శ్రీనివాస్, పోచయ్య ,హుంమంతు, లింగమ్మ ,సత్యమ్మ , జీతమ్మ , వెంకటేష్ , లక్ష్మమ్మ ఎన్నికైనారు.