తెలంగాణలో తహశీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
తహశీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాలకు తిరిగిపోయే విధంగా అవకాశం కల్పిచాలని టీజీటీఏ మొదటి నుంచి చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే ఇదే విషయమై మంత్రి పొంగులేటికి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ని పలు మార్లు టీజీటీఏ నేతలు కలిసి వినతిపత్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాల్సిందిగా తహశీల్దార్లకు అవకాశం ఇస్తూ సీసీఎల్ఏ ఆదేశాలను జారీ చేశారు.