సురభి గో మాతకు వందనాలు

ఉరుగ్వే జనాభా కేవలం 33 లక్షలు, కానీ దేశంలో 1.20 కోట్ల ఆవులు ఉన్నాయి.

ప్రతి ఆవుకి చెవిలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఎక్కడ ఉందో గమనిస్తారు.

వ్యవసాయంలో డ్రోన్లు, శాటిలైట్ పర్యవేక్షణ, ఆటోమేటిక్ యంత్రాలు వాడుతూ అత్యుత్తమ దిగుబడులు సాధిస్తున్నారు.

2005లో 99 లక్షల మందికి సరిపడా పంట పండించిన దేశం, నేడు 2.8 కోట్ల మందికి సరిపడేంత ఆహారం ఉత్పత్తి చేస్తోంది.

రైతుల కనీస వార్షిక ఆదాయం 190,000 డాలర్లు (సుమారు రూ.1.5 కోట్లు).

ఉరుగ్వే—దక్షిణ అమెరికాలోని చిన్న దేశం, కానీ వ్యవసాయం పరంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 33 లక్షల జనాభా కలిగిన ఈ దేశంలో పశుసంపద అత్యంత విస్తారంగా ఉంది. ఒక్కో పౌరునికి సగటున నాలుగు ఆవులు ఉండేంత స్థాయిలో పశుపోషణ అభివృద్ధి చెందింది. దేశంలోని మొత్తం ఆవుల సంఖ్య 1 కోటి 20 లక్షలు.

ప్రతి ఆవుకి చెవిలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చడం ద్వారా వాటి కదలికలు, ఆరోగ్య స్థితి, ఉత్పాదకతపై ప్రభుత్వం క్షుణ్ణంగా పర్యవేక్షణ చేస్తోంది. అదే విధంగా రైతులు పంటలు కోయడానికి వాడే యంత్రాలపై ప్రత్యేక పరికరాలు అమర్చబడి ఉంటాయి. ఆ పరికరాలు రియల్‌టైమ్‌లో దిగుబడి వివరాలు స్క్రీన్‌పై చూపిస్తాయి. దీంతో రైతులు ప్రతి చదరపు మీటరుకు పంట ఉత్పత్తి ఎంత వచ్చిందో ఖచ్చితంగా తెలుసుకుని విశ్లేషణ చేస్తారు.

2005లో 33 లక్షల జనాభా గల ఉరుగ్వే, 99 లక్షల మందికి సరిపడేంత పంట పండించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడింతలు పెరిగి 2.8 కోట్ల మందికి సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ విశేష అభివృద్ధి వెనుక రైతులు, పశుపోషకులు, శాస్త్రవేత్తల కృషి ఉంది. వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షించడానికి 500 మంది నిపుణులు డ్రోన్లు, శాటిలైట్ సాంకేతికతను ఉపయోగిస్తూ రైతులకు సూచనలు అందిస్తున్నారు.

అంత అధిక స్థాయిలో ఉత్పత్తి జరుగుతుండటంతో పాలు, పెరుగు, నెయ్యి, వెన్నతో పాటు వివిధ ధాన్యాలను విస్తృతంగా ఎగుమతి చేస్తున్నారు. ప్రతి రైతు కనీసం నెలకు రూ.1.2 లక్షల ఆదాయం పొందుతుండగా, వార్షికంగా సుమారు 190,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నారు.

ఆ దేశం జాతీయ చిహ్నం సూర్యుడు కాగా, జాతీయ ప్రగతిని ప్రతిబింబించే చిహ్నాలు ఆవు మరియు గుర్రం. ఆవును చంపితే మరణశిక్ష విధించే కఠిన చట్టం కూడా అమల్లో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉరుగ్వేలో ఉన్న ఈ ఆవులు భారతీయ సంతతికి చెందినవే. వాటిని ‘ఇండియన్ కౌ’ అని పిలుస్తారు.

 

భారతదేశంలో గో హత్యలు జరుగుతుండగా, ఉరుగ్వేలో మాత్రం ఆవును దైవస్వరూపంగా భావించి రక్షిస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, క్రమశిక్షణ, పశుసంపద సంరక్షణలో ఉరుగ్వే నుండి భారతదేశం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

“సురభి గో మాతకు వందనాలు…”

Join WhatsApp

Join Now

Leave a Comment