Site icon PRASHNA AYUDHAM

ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు: నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

IMG 20250422 205748

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో పెయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని, నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు. పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని, కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు వారివారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని మెట్టు శ్రీధర్ కోరారు. దేశ భవిషత్ నిర్మాణంలో విద్యార్థులు యువతదే కీలక పాత్ర అని, చిన్న చిన్న కారణాలతో వారు జీవితాన్ని చలించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించడం చాలా భాధాకరమని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెట్టు శ్రీధర్ పేర్కొన్నారు.

Exit mobile version