నేస్తం సేవా సంస్థ సభ్యులకు చిరు సత్కారం
నేస్తం_సేవా_సంస్థ సభ్యులకు మన మైదుకూరు లో అరుదైన గౌరవం దక్కింది. మన మైదుకూరు మిత్ర కమిటీ గణేశ్ మహోత్సవములు సందర్భంగా మన నేస్తం సేవా సంస్థ సభ్యులను ఆహ్వానించి ఆత్మీయంగా సన్మానించారు. మన నేస్తం సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి గౌరవిస్తూ వై.యస్.ఆర్.సి.పి యువ నాయకులు ఏవన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ శ్రీ మూలే భరత్ కుమారు రెడ్డి గారి చేతుల మీదుగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అందరికి మెమోంటో అందించి శాలువతో ఘణంగా సన్మానించారు.మా నేస్తం సేవా సంస్థ సభ్యులకు ,సేవకులకు,రక్తదాతలకు అన్నదాతలకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మన నేస్తం సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను అభినందిస్తూ ఇంతటి అవకాశాన్ని కల్పించిన మిత్ర కమిటీ టీం సభ్యులు అందరికి మా నేస్తం సేవా సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ..