తెలంగాణలో ప్రారంభమైన గ్రూపు 1 పరీక్షలు..
-అభ్యర్థుల పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియరైంది. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29 ని రద్దు చేయాలని కొందరు అభ్యర్ధులు ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు అక్టోబర్ 21న సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్ తరపు న్యాయవాదులు కోరారు. పరీక్షలు రాసే సమయంలో తాము ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునకు కట్టుబడి ఉండాలని ఉన్నత న్యాయ స్థానం సూచించింది.
దీంతో నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు కొనసాగను న్నాయి. మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్ 1 పరీక్షలు..
by kana bai
Published On: October 21, 2024 8:25 pm