Site icon PRASHNA AYUDHAM

ఏపీలో రేపటి నుంచి గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు

IMG 20250502 WA1992

*ఏపీలో రేపటి నుంచి గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు*

*13 పరీక్ష కేంద్రాలు…*

*4,496 మంది అభ్యర్థులు*

*అమరావతి:మే 02*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి.

విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరు పతిలో 3, అనంతపురంలో 2, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని,ఉదయం 8:30నుండి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తా రని తెలిపింది.

అభ్యర్థులు పరీక్ష కేంద్రం లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూ డదని సూచించింది.

Exit mobile version