గ్రూప్-II పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ

*గ్రూప్-II పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్*

*జిల్లాలో 21 కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ముగిసిన గ్రూప్-II పరీక్ష.*

*పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది*

*సెక్షన్163 బి ఎన్ ఎస్ ఎస్ (144సెక్షన్)అమలు.*

*మహబూబాబాద్ ప్రతినిధి, డిసెంబర్

సోమవారం గ్రూప్ – II రాత పరీక్షలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ పరిశీలించారు. పరీక్ష సరళిని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు పాఠశాల, ఫతిమా హై స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అందరు బాధ్యతగా పని చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూముకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి సూచించారు.

IMG 20241216 WA0036

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 21 పరీక్ష కేంద్రాలు స్కూలు, కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now