గల్ఫ్ కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి 

గల్ఫ్ కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

 లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ 

గల్ఫ్ కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులు ఈ మధ్యలో చాలా మంది హార్ట్ హాట్టాక్ తో మరణించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, సమయం చూసుకొని వాకింగ్, వ్యాయామం, యోగ చేయాలని కోరారు. దయచేసి గల్ఫ్ కార్మికులు సహనం కోల్పోవద్దని అన్నారు. వీవిద కార్మికులుగా గల్ఫ్ లో, పనిచేస్తున్న వారు ఇప్పుడు గల్ఫ్ లొ చల్లటి వాతావరణం ఉంటుంది కావున పని చేస్తున్న సమయంలో హెల్త్ పై శ్రద్ధ చూపడం అవసరమన్నారు. సేఫ్టీగా పని చేస్తూ వుండాలని, ముఖ్యంగా గ్లోవ్స్, మాస్క్, హ్యాండ్ సానిటైజర్. సెఫ్టీ బెల్టు, సేఫ్టీ షూ, సేఫ్టీ గోగులు, సేఫ్టీ జాకేటు, సేఫ్టీ డ్రైవింగ్ గురించి కూడా ఆలోచించాలని తెలిపారు. వీటిని అనుసరిస్తూ ప్రతి దినమూ పని చేసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని అన్నారు. ఈ మధ్య అనారోగ్యం గురయిన కార్మీకులు పలు సమస్యలను ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ దృష్టికి తీసుకువచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment