సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మనసు-మమత అనే అంశంపై నిర్వహించిన, 24వ కవిత పోటీలో ద్వితీయ బహుమతిని ప్రకటించి అందమైన ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు గుండం మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తనకు కవిత పోటీలో ద్వితీయ బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందజేసిన విమల సాహితీ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ జెల్ధీ విద్యాధర్, సంపాదకులు శైలజ మిత్ర, సంపాదకులు నిర్వహణ కమిటీ అడ్మిన్ డాక్టర్ రాధా కుసుమ, సంపాదకులు రోహిణి వంజారి సహ సంపాదకులు మంజుల సూర్య, కృష్ణవేణి పరాంకుశం, గౌరవ సలహాదారు డా.మల్లెపోగు వెంకట లక్ష్మమ్మలకు ద్వితీయ బహుమతి గ్రహీత గుండం మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.