గుప్పెడు బియ్యం… వరద బాధితులకు బాసట
— మహిళా సంఘాల ఐకమత్యం
— కలెక్టర్ చేతుల మీదుగా సహాయం పంపిణీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 20
కామారెడ్డి జిల్లా,
రాజంపేట మండల పరిధిలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలవడానికి మహిళా శక్తి ఆధ్వర్యంలో “గుప్పెడు బియ్యం” కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు.
మొత్తం 22 క్వింటాళ్ల పైచిలుకు బియ్యం సేకరించగా, రాజంపేట మండలంలోని 20 గ్రామ సంఘాల పరిధిలోని 584 స్వయం సహాయక సంఘాల సభ్యులు సహకరించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలుత నడిమి తండా, ఎల్లాపూర్ తండాలలోని 10 మంది లబ్ధిదారులకు బియ్యం బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ఐకమత్యం ఆదర్శనీయమని, “ఆపదలో మేమున్నాం” అనే గొప్ప భరోసాను భాదితులకు అందించారని కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో పాటు మహిళా సంఘాలు, దాతలు ముందుకు రావడం బాధితులకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని, ఇతర సంఘాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సాటి మనుషులను ఆపద సమయంలో ఆదుకోవడం పట్ల మహిళా సంఘ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, DRDO సురేందర్, అదనపు DRDO విజయలక్ష్మి, APM రాజారెడ్డి, సీసీలు, మండల సమైక్య రాజంపేట అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లత, కోశాధికారి లావణ్య, నడిమి తండా, ఎల్లాపూర్ తండాల లబ్ధిదారులు పాల్గొన్నారు.