చందాయిపేటలో ఘనంగా గురుపూజోత్సవం
-ముఖ్య అతిథిగా తాజామాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్.
ప్రశ్న ఆయుధం మెదక్ జిల్లా చేగుంట న్యూస్ సెప్టెంబర్ 06:-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు శంకర్ కి ఘనంగా సన్మానించినట్లు చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తెలిపారు. చందాయపేటలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ…
మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తామని అలాగే మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిదని,అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో
టీచర్స్ డే జరుపుకుంటున్నామని తెలిపారు.పీఎంశ్రీ లో 20 మంది ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గొప్ప విషయమని, సన్మానం పొందిన ఉపాధ్యాయుల మీద ఇంకా గురతరమైన బాధ్యత పెరుగుతుందని ఇంకా భవిష్యత్తులో మండలానికి మంచి పేరు తీసుకు రావాలని కోరామని తెలిపారు.ఈ కార్యక్రమంలో
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు శంకర్
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషన్,విట్టల్ రెడ్డి,నర్సింలు,అజిత,సిద్ధరాములు,శంకర్,వీణ,సలీం,రాములు,గిరిధర్,దామోదర్,సౌజన్య,యాదగిరి,శ్రీనివాస్, బంగారయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.