కడుపునొప్పితో గురుకుల విద్యార్థిని మృతి

కడుపునొప్పితో గురుకుల విద్యార్థిని మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) బుధవారం కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడకు చెందిన ఆత్రం పార్వతి సాసిమెట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. పొలాల అమావాస్యకు ఇంటికి వచ్చింది. ఆపై జ్వరంతో పాటు కడుపునొప్పి రావడంతో ఉట్నూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. మూడు వారాల క్రితం డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. ఈ క్రమంలో బుధవారం కడుపునొప్పి తీవ్రమై మృతి చెందినట్టు బాలిక తండ్రి ఆత్రం భీంరావు, మామ రాజు తెలిపారు.

Join WhatsApp

Join Now