*”ప్రతి శ్రేయోభిలాషి గురువుతో సమానమే”: గురు పౌర్ణమి వేడుకల్లో తోటకూర వజ్రేష్ యాదవ్*
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం జూలై 10
“మన బాగు కోరుతూ మంచి మార్గం చూపించే ప్రతి శ్రేయోభిలాషి, గురువుతో సమానమే” అని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్, మెక్‌డొనాల్డ్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జన్మనిచ్చే తల్లిదండ్రులు మన మొదటి గురువులు. విద్యను బోధించే ఉపాధ్యాయులు రెండవ గురువులు. అయితే మన జీవితంలో మార్గదర్శనం చేసే వారెవరైనా గౌరవానికి పాత్రులే,” అన్నారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, తోటకూర చందర్ యాదవ్, తోటకూర విజయ్ యాదవ్, రాజలింగం, కాలనీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.