జిల్లా పార్టీ అధ్యక్ష పదవి పరిశీలనలో గురువారెడ్డి ?

సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ అధ్యక్ష పదవి ఎవరికో??

– జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో గజ్వేల్ నుంచి గురువారెడ్డి?

– మోహన్ రెడ్డిని కొనసాగిస్తారా లేక గురువా రెడ్డిని ఎంపిక చేస్తారా?

గజ్వేల్ 12 జనవరి 2025 :

వ్యవస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసే దిశగా 41 లక్షల పార్టీ సభ్యత్వం సాధించిన తెలంగాణ బీజేపీ తాజాగా మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి ఈ నెలాఖరులోగా అంచెలంచెలుగా రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్ సభ పరిధిలోకి వచ్చే సిద్ధిపేటపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడుగా సిద్ధిపేటకు చెందిన గంగాడి మోహన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసే క్రమంలో మోహన్ రెడ్డినే కొనసాగిస్తారా లేక కొత్త నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన సిద్ధిపేట జిల్లాలో బీజేపీ పార్టీకి సమర్థనాయకత్వం కోసం వెతుకుతున్నది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ కీలకనేత హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎప్పటికప్పుడు కార్యాచరణ అవసరముంది. మెదక్ ఉమ్మడి జిల్లా గా ఉన్నపుడు గానీ, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జిల్లా బీజేపీ సారథ్య బాధ్యతలు సిద్ధిపేటకే దక్కినందున ఈసారి తమకు అప్పగిస్తే న్యాయం చేస్తామంటూ గజ్వేల్ నేతలు వెల్లడిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న రైతుల సమస్యలు, పేద ప్రజల సమస్యల గురించి ప్రభుత్వంతో, పోలీసు స్టేషన్ సంబంధిత సమస్యలపై గురువా రెడ్డి ముందు ఉండి పార్టీని నడిపిస్తున్నారు. దారం గురువా రెడ్డికి ఈసారి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని గజ్వేల్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now