భద్రాచలంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా, పాన్ మసాలాలను జిల్లా టాస్క్ ఫోర్సు సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించి సుమారు రూ. 2 లక్షల విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పట్టణంలో రెండు చోట్ల భారీగా నిల్వలు పట్టుబడ్డాయి. పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామన్నారు.