గ్యారిమి షరీఫ్ జెండా పండుగ వేడుకలు

గ్యారిమి
Headlines :
గ్యారిమి షరీఫ్ జెండా పండుగ వేడుకలు
*భక్తి శ్రద్ధలతో గ్యారిమి షరీఫ్( జెండా) పండుగ వేడుకలు*
*జమ్మికుంట, నవంబర్ 2 ప్రశ్న ఆయుధం::-*
ముస్లింల అతి పవిత్రమైన మాసం రబ్బి ఉల్ సానిలో ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో గ్యారిమి షరీఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది క్రీ॥శ॥ 1078( 1రంజాన్ 471 హీజ్రి) సంవత్సరంలో ఇరాక్ దేశంలోని జిలాన్ గ్రామంలో హజ్రత్ అబుసాలెహ్ ముసా సయ్యదా అబుల్ ఖైర్ ఫాతిమా దంపతులకు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలై అనే కుమారుడు జన్మించాడు చిన్న తనంలోనే తండ్రి పోగొట్టుకున్న హజ్రత్ గౌసే ఆజమ్ తల్లి సంరక్షణలో పెరిగి అల్లాహ్ సందేశాలు, ఖురాన్ బోధనలను తల్లి వద్దే నేర్చుకున్నారు 18 సం”ల వయసులో ఆధ్యాత్మిక చదువు కోసం ఆ రోజుల్లో చదువుల నిలయంగా పిలువబడే బాగ్దాద్ నగరానికి చేరుకొని బాగ్దాద్ లో విద్యను అభ్యసిస్తూ అల్లాహ్ సందేశాలను ఇస్లాం బోధనలు ఖురాన్ లోని సూక్తులను ప్రజలకు తెలియజేస్తూ తాను నేర్చుకున్న విద్యబుద్ధులను ఇతరులకు బోధిస్తు అల్లాహ్ వద్ద మహబుబె సుభాని గా పిలువబడ్డారు ఆయన జీవితకాలంలో ప్రదర్శించిన మహిమలు బాధితుల పట్ల చూపిన కరుణ దయ వల్ల ఎందరో సుఖజీవనం గడపగలిగారు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని క్రీ||శ|| 1167(11 రబ్బి ఉల్ సాని561 హీజ్రీ)లో భగవంతుడిలో లీనమైనారు ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం
ముస్లింలు జరుపుకునే పండుగే గ్యారీమీ షరీఫ్ గ్యారీమీ షరీఫ్ వేడుకలు సందర్భంగా జమ్మికుంట పట్టణంలో శనివారం రోజున సాయంత్రం ఫాతేహఖ్వాని కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జెండా ఊరేగింపు చేసి హజ్రత్ గౌసే ఆజమ్ దస్తగిర్ రహ్మతుల్లాహ్ అలై జెండా గద్దె వరకు ముస్లిం యువకులు భక్తి శ్రద్ధలతో అల్లాహ్ కీర్తనలతో పాత వ్యవసాయ మార్కెట్ వెనకాల ఉన్న జెండా గద్దె వద్ద ప్రతిష్ఠించారు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ముస్లింల మత గురువు మౌలానా మొహమ్మద్ జహీరుల్ ఖాద్రి , మౌలానా నసీర్ ఖురేషి ధార్మిక తేజోమయ ఉపన్యాసం చేసినారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి యూత్ కమిటీ పాటు ముస్లిం యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now