విజయవాడలో హైందవ శంఖారావం సభ… డిక్లరేషన్ ప్రకటించిన వీహెచ్ పీ
వీహెచ్ పీ ఆధ్వర్యంలో కేసరపల్లి వద్ద భారీ ఎత్తున హిందూ సభ
లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు
హాజరైన చినజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు
హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం తదితర అంశాలే అజెండాగా నేడు విజయవాడ కేసరపల్లిలో హైందవ శంఖారావం సభ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చారు.
చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితర ఆధ్యాత్మికవేత్తలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేశారు. కాగా, ఈ హైందవ శంఖారావం సభలో వీహెచ్ పీ కీలక డిక్లరేషన్ ను ప్రకటించింది. చినజీయర్ స్వామి హైందవ శంఖారావం డిక్లరేషన్ ను అందరితో ప్రతిజ్ఞ చేయించారు.