*కామారెడ్డి పట్టణంలో ఉత్సాహంగా హాఫ్ మారథాన్*
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

పట్టణంలోని ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణం నుండి ఆఫ్ మారథాన్ ను నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో చైల్డ్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ పద్మ పాణి సొసైటీ, లిటిల్ స్కాలర్స్, ఆర్కే విద్యాసంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని ఆర్కే కళాశాల, లిటిల్ స్కాలర్స్, ఎస్పీఆర్ స్కూల్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ చైతన్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ చైల్డ్ హుడ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి క్యాన్సర్ నుండి మేలుకొలపడానికి ఉపయోగపడతాయని, రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు రెట్టింపు చేసి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 5k,10k, 21k & 3k కిడ్ రన్ లను గ్రూప్ లుగా విభజించి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణం నుండి సిఎస్ఐ చర్చి, నిజాంసాగర్ చౌరస్తా, పాత రాజంపేట వరకు ఈ ఆఫ్ మారథాన్ కొనసాగింది. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు, విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మపాణి సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ స్వర్ణలత, విద్యాసంస్థల ప్రతినిధులు జైపాల్ రెడ్డి, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, సిఐ చంద్రశేఖర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 24