వచ్చిన సంపాదనలో సగం పేద ప్రజలకె..
– నేడు ఆ శ్రీమంతురాలి జన్మదినం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పేద విద్యార్థుల ఉన్నతికై పాటుపడుతున్న నిజమైన శ్రీమంతురాలు శ్రీమతి తిమ్మయ్యగారి రజినీసుభాష్ రెడ్డి జన్మదినం ఫిబ్రవరి 2 సందర్భంగా పలువురు జనగామ గ్రామం, బిబిపేట మండలం, కామారెడ్డి జిల్లా తో పాటు పలు జిల్లాలోని వీరి గురించి తెలిసినవారు వాట్సాప్ గ్రూపులలో తిమ్మయ్య గారి రజిని సుభాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి పేద ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ ఆమెకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సుభాష్ రెడ్డి దంపతులు తమకు వచ్చిన ఆదాయంలో సగం పేద ప్రజలకే ఇస్తూ వారి దయార్థ హృదయాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం పలువురు వ్యాపారం చేసే వ్యక్తులు ధనార్జినే ధ్యేయంగా వ్యాపారాలు చేస్తున్న ఈ రోజుల్లో ఈ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి కుటుంబం మాత్రం తమకు వచ్చిందాంట్లో సగం ఆదాయాన్ని పేద ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఖర్చు చేస్తూ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు.