జాయింట్ కలెక్టర్ కి డిమాండ్ తో కూడిన వినతిపత్రం అందజేత..!

కలెక్టర్
Headlines
  1. హమాలీ కార్మికుల కూలీ రేట్లు 50% పెంచాలి
  2. 50 ఏండ్లు నిండిన కార్మికులకు నెలకు ₹5000 పింఛన్
  3. రైస్ మిల్లుల ప్లాస్టిక్ సంచుల నిషేధం డిమాండ్
  4. కార్మికులకు త్రాగునీటి, విశ్రాంతి సదుపాయాలు అందించాలి
  5. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం కావాలి
–హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

–నెలకు 5000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మిల్ అండ్ హమ వర్కర్స్ యూనియన్ ఏ ఐ ఎఫ్ టి యు న్యూ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా పాత రేట్లపైన 50% హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని, రైస్ మిల్లులలో దిగుమతికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడులను రద్దు చేయాలని, 50 సంవత్సరములు నిండిన హమాలీ కార్మికుడికి నెలకు 5000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని, కార్మికులు పనిచేయుచున్న పరిశ్రమలలో త్రాగునీటి సౌకర్యం, విశ్రాంతికి షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం తెచ్చి, పని భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్స్ తో ధర్నా నిర్వహించడం జరిగినది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కి డిమాండ్ తో కూడిన వినతిపత్రం సమర్పించడం జరిగినది.ఈ ధర్నా ను ఉద్దేశించి ఏ ఐ ఎఫ్ టి యు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడెం మల్లేశం మాట్లాడటం జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈర్ల పైడి, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు ఈరెల్లి రామచందర్, ఓపిడిఆర్ రాష్ట్ర నాయకులు బీరం రాము, గంటా శంకర్, మరియు కార్మిక సంఘం నాయకులు రొట్టె శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, చిన్న పేల్లి పోశాలు, మెరుగు జనార్ధన్, గడ్డం శ్రీనివాస్, మంద మల్లయ్య, బాస రాజేందర్, గాదం రవి, అజ్మీర చందర్, దుడేలా సధి, గాజ సాంబన్న, ఏకాంబరం, ఐలయ్య, భూక్య రాజు, కొలిపాక మొగిలి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now