చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

చేనేత పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక

తిరంగా అభియాన్ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలి

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

కరీంనగర్ ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం

చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని , చేనేత పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిదని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి , సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు గురువారం రోజున తిమ్మాపూర్ బిజెపి మండల శాఖ ,బిజెపి నేత మాజీ జెడ్పిటిసి ల ఆధ్వర్యంలో మండలంలోని పచ్చునూర్ , తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించారు అనంతరం మండల కార్యాశాల తిరంగా అభియాన్ ప్రోగ్రాం కు సంబంధించిన సన్నాక సమావేశం నిర్వహించారు ఆయా కార్యక్రమాలకు హాజరైన బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ భారతదేశంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి చేనేత కార్మికులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా 1905 లో బ్రిటిష్ ఉత్పత్తులను బహిష్కరించడం ద్వారా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని ప్రధానంగా ఈ ఉద్యమం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం , స్థానిక చేనేత పరిశ్రమను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ముందుకు కొనసాగిందన్నారు. భారతదేశంలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని , గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఈ రంగమే ఉపాధి కల్పిస్తుందన్నారు. చేనేత పరిశ్రమతో ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కట్టుబడి పని పనిచేస్తుందని తెలిపారు తిరంగా అభియాన్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ తో దేశ ఖ్యాతినీ విశ్వానికి చాటి చెప్పడం జరిగిందన్నారు. భారతదేశ శక్తి సామర్థ్యాలు నేడు ప్రపంచ దేశాలు గుర్తించాయని దేశంలో ఉండే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం గుర్తించడం లేదని , ఆపరేషన్ సింధూరపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ దేశాన్ని కించపరిచేలా వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు బిజెపి నాయకులు కార్యకర్తలు తిరంగా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా దేశ త్రివిధ దళాల శక్తిసామర్థ్యాలు , గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించేలా, వాడ వాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తిమ్మాపూర్ , పచ్చునూరు గ్రామాలలో పలువురు చేనేత వృత్తిదారులు, కార్మికులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి , మాజీ జెడ్పిటిసి ఎడ్ల జోగిరెడ్డి,మాజీ ఎంపీటీసి ఒడ్డె రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి,రాష్ట్ర నాయకులు పుప్పాల రఘు, జిల్లా ఈసి సభ్యులు బూట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,తమ్మనవేణి రాజు యాదవ్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్ గౌడ్,కానుగంటి మధుకర్ రెడ్డి,రామిడి మహేందర్ రెడ్డి,ఉప్పులేటి జీవన్,వీణవంక అంజి,ఈగ వెంకటేశం, అందె శేఖర్,చేనేత సంఘం నాయకులు అడిచర్ల రవి, లక్ష్మణ్,పిస్క భూమేష్,రాజ్ కుమార్,బండి స్వామి,కాల్వ శ్రీనివాస్, మల్లేశం గౌడ్,మహేష్,కామెర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment