ఇల్లులు కొనిస్తానని చెప్పి దంపతులు ఘరానా మోసం!

చెప్పి
Headlines
  1. హన్మకొండలో ఇళ్ల పేరుతో మోసం: 15 మంది బాధితుల దగ్గర 3 కోట్లు కాజేసిన దంపతులు
  2. గోపాలపురం దంపతుల అక్రమ వ్యాపారం: మోసపోయిన 15 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు
  3. ఇస్లావత్ స్వామి, ఇస్లావత్ సునీత దంపతుల మోసం: 3 కోట్ల డబ్బుతో విలాసవంతమైన భవనాలు
  4. ఇల్లుల కోసం మాయ మాటలు చెప్పి కోట్లు తీసుకున్న హన్మకొండ దంపతులు
  5. మోసపోయిన బాధితులు గోపాలపురం దంపతులపై పోలీసులకు ఫిర్యాదు: న్యాయం కోరుతున్నారు

-హన్మకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

-15 మంది బాధితుల దగ్గర మూడు కోట్లు కాజేసిన దంపతులు

హన్మకొండ జిల్లా 

మధ్యతరగతి కుటుంబాలకి ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. ఆ కోరికనే ఆసరాగా చేసుకొని హన్మకొండ గోపాలపురం కు చెందిన ఇస్లావత్ స్వామి అతని భార్య ఇస్లావత్ సునీత అదే తండాకు చెందిన వారి బంధువులకు హనుమకొండలో ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి సుమారు 15 మంది దగ్గర రూ..3 కోట్ల రూపాయలను కాజేశారు. తాము మోస పోయమని గ్రహించిన బాధితులు.. పోలీస్ లను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…ఇస్లావత్ స్వామి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తుండగా, అతని భార్య ఇస్లావత్ సునీత బట్టల దుకాణం ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చే మధ్యతరగతి మహిళలే టార్గెట్ గా పెట్టుకొని వారికి మాయమాటలు చెప్పి వారి దగ్గర 118 మంది బాధితుల నుండి సుమారు రూ. 24 కోట్ల రూపాయల డబ్బులను కాజేశారు. కాజేసిన డబ్బుతో హైదరాబాద్, హన్మకొండ ప్రాంతాల్లో విలాస వంతమైన భవనాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు…ఈ కిలాడి దంపతుల ద్వారా మోసపోయామని గ్రహించిన బాధితులు మొత్తం 118మంది కలిసి వారి ఆచూకీ కోసం వెతక సాగారు… హనుమకొండలోని వడ్డేపల్లిలో రహస్యంగా నివాసం ఉంటున్నారని తెలుసుకొని బాధితులు… మోసకారి దంపతుల ఇంటికి వెళ్లి ప్రశ్నించగా బాధితులపై దురుసు ప్రవర్తన చేయగా తక్షణమే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు… అనంతరం బాధితులు మాట్లాడుతూ..తక్కువ ధరకే ఇండ్లు ఇప్పిస్తా అంటూ..మాయ మాటలు చెప్పి, కోట్లలో డబ్బులు వసూల్ చేశారు. తమకు న్యాయం చేయాలని… బాధితులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now