మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీ హనుమద్దాసు సుందరకాండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణం, ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేశాయి. శ్రీనివాస్ ప్రవచనాలు హనుమాన్ మహిమను వివరిస్తూ భక్తులందరిలో భక్తి భావాన్ని నింపాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, ఇమ్మడి శ్రీనివాస్ గుప్తా, మల్లేశం గుప్తా, నోముల పాండురంగం, మిర్యాల చంద్రశేఖర్ గుప్తా, భైరవ ప్రసాద్ గుప్తా, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ వాసవి ఆలయంలో హనుమాన్ చాలీసా సంకీర్తన
Published On: July 27, 2025 9:03 pm