Site icon PRASHNA AYUDHAM

ఘనంగా రేవెల్ల రాజేష్ జన్మదిన వేడుకలు..

GridArt 20241020 213802411

ఘనంగా రేవెల్ల రాజేష్ జన్మదిన వేడుకలు..

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:

శేరిలింగంపల్లి నియోజకవర్గం జనరల్ సెక్రెటరీ అయిన రేవెల్ల రాజేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, ఆయన అభిమానులు కార్యకర్తలు కాలనీలో కోలాహంగా, ఆదివారం రాత్రి వేడుకలు నిర్వహించడం జరిగింది, అలాగే ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి అయిన వి జగదీశ్వర్ గౌడ్ నివాసానికి వెళ్లి ఆయన యొక్క అభిమానం మేరకు షాలువాతో జగదీశ్వర్ గౌడ్ సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నోరు తీపి చేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంబీసీ చైర్మన్ అయిన జరిపేటి జైపాల్ రేవెల్ల రాజేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే రాజేష్ జరిపేటి జైపాల్ జన్మదిన పురస్కరించుకొని వారికి కూడా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేయడం జరిగింది. పార్టీ కొరకు నిరంతరం కష్టపడే వ్యక్తి రాజేష్ ప్రజలలో ఆదరభిమానాలు చూరగొంటున్న నేటి యువ నాయకుడు, ఎల్లవేళలా అందరితో ఉంటూ సహాయ సహకారాలు అందించే మంచి వ్యక్తి అని కొనియాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కుమార్ రేవెల్లే సుజిత్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Exit mobile version