శ్రీ జగదాచార్యుడు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఘనంగా జన్మదిన వేడుకలు
వికాస తరంగిణి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు
జమ్మికుంట అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం
శ్రీ జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారి తిరు నక్షత్రం పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం రోజున వెంకటాద్రి నగర్ లో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలొ చిన్న జీయర్ స్వామి వారి జన్మదిన వేడుకలను ఘనంగా వికాస తరంగిణి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు సమక్షంలో సాయంత్రం 6 గంటల లకు జరుపుకున్నారు వారి యొక్క సేవ వారు ఉపన్యసిస్తే ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులు అవుతారని వారి ఆశీర్వచనంతో ఎంతోమంది శిష్యులు ప్రవచనాలు చేస్తున్నారని తెలిపారు దేశం పట్ల ప్రాంతం పట్ల పెద్దలపట్ల అనుసరించవలసిన విధానాలను చాలా చక్కగా వివరిస్తూ ఉంటారని తెలిపారు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి మంగళా శాసనాలు ప్రతి ఒకరి పైన కలగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు వికాస తరంగిణి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు