ఘనంగా అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22 శేరిలింగంపల్లి పప్రతినిధి
శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీదు బండ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో వారి జన్మదిన వేడుకలు అభిమానుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పూలమాలలతో బ్యాండ్ బజాల హోరు తో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆటో యూనియన్ వారికి యూనిఫామ్ లు అందజేసిన అనిల్ కుమార్ యాదవ్ . అనంతరం ఎం. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నా జన్మదిన సందర్భంగా విచ్చేసిన శేరిలింగంపల్లి నియోజక వర్గ నాయకులకు, అధికారులకి, అనధికారుల కి, పాత్రికేయ మిత్రులకు, మహిళలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వివిధ పార్టీ ల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.