బక్కోల బాలా గౌడ్‌కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

బక్కోల బాలా గౌడ్‌కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో వేడుకలు

శాలువాతో సన్మానించిన మురళి గౌడ్

కేక్ కట్ చేసి ఉత్సాహంగా జరుపుకున్న వేడుకలు

పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు

కార్యక్రమంలో పలువురు గౌడ్ నేతల పాల్గొనడం విశేషం

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, ఆగస్టు 5

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బక్కోల బాలా గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్ బాలా గౌడ్‌ను ఆయన నివాసంలో శాలువాతో సన్మానించారు.

తరువాత కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఇందూరి సిద్ధా గౌడ్, బాపురావు, కర్రోల్ల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు, అభిమానులు బాలా గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment