బండారు మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు
– గజ్వేల్ మండల బిజెపి నాయకులు బారు అరవింద్
గజ్వేల్, 08 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆఫీస్ లో గజ్వేల్ నియోజకవర్గం బిజెపి యువ నాయకుడు బండారు మహేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండల నాయకులు బారు అరవింద్ బండారు మహేష్ ను పూలమాలతో సత్కరించి బొకే తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం వారు అరవింద్ మాట్లాడుతూ మహేష్ బండారు మహేష్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నానని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని బిజెపి లో మంచి పదవులు పొందాలని ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.