ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 27 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
లయన్ కోనేరు పూర్ణచందర్రావుకు శాలువా కప్పి స్వీట్లు పంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్.కోనేరు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి, విశిష్టమైన సేవలు అందించినారని అభినందించారు.
వారికి నేను వ్యక్తిగత కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు పనిచేయడం అది నాకు అదృష్టమని,
వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని,వారి జేష్ఠ కుమారుడైన లయన్ కోనేరు పూర్ణచంద్రరావు,లయన్స్ క్లబ్ ద్వారా,ఇటు కొత్తగూడెం క్లబ్ సెక్రటరీగా మరియు స్వర్గీయ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా నిరంతరం విశిష్టమైన సేవలు అందిస్తున్నారని,వారు ఒక నిష్కల్మష వాది, యదార్థవాది.కోనేరు సత్యనారాయణ[ చిన్ని] కూడా వారి నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేస్తున్నారని వీరిరువురు కూడా రామ లక్ష్మణుల్లా అలరారుతూ ఈ సమాజానికి సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా అపరబాలు అల్లి శంకర్,చిరంజీవి సేవ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి విల్సన్ బాబు,భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్,టిఏ 9
ఛానల్ అధినేత నరసింహ,జాన్ తదితరులుపాల్గొన్నారు.
కోనేరు పూర్ణచందర్రావు జన్మదినం శుభాకాంక్షలు *డాక్టర్ మద్దెల శివకుమార్
by Naddi Sai
Published On: July 27, 2025 8:23 pm