ఎస్సీ హక్కుల సంఘం ఆధ్వర్యంలో
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 15 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి కొత్తగూడెం టౌన్ కమిటీ గౌరవ సలహాదారు మంద వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జన్మదిన కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని శాలువా కప్పి పూలబొకే అందజేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కష్టజీవుల పక్షాన నిరంతరం కొట్లాడిన కమ్యూనిస్టు వారసుడి జన్మదినాలుమరెన్నో జరుపుకోవాలనిఅభినందించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా,చదలవాడ సూరి,కొండ జంపన్న,మురళి, సలిగంటి కొమరయ్య, ఇనుగంటి శ్రీను తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే కూనంనేనికి జన్మదిన శుభాకాంక్షలు
