ఎంపీ రఘునందన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు : మంకిడి స్వామి

ఎంపీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంకిడి స్వామి

దుబ్బాక నియోజకవర్గం, 23 మార్చి 2025 :

రాయపోల్ మండల బిజెపి అధ్యక్షులు మంకిడి స్వామి మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం నాడు ఎంపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ను సంగారెడ్డి బిజెపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల బిజెపి అధ్యక్షులు మంకిడి స్వామి మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, ప్రజా నాయకుడు అలుపెరుగని పోరాట యోధుడు,ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్నన పొందుతున్న మా అభిమాన నాయకుడు ఎంపీ రఘునందన్ రావు అని అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారు నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు సేవ చేయాలని, వారు ఎల్లప్పుడూ ప్రజా క్షేత్రంలోనే ఉంటూ ప్రజల మన్ననలు పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవున్నీ వేడుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు క్విజ్ పోటీలలో పాల్గొని గెలిచిన విజేతలకు బహుమతులను, ప్రశంస పత్రాలను అందజేశారు. అలాగే తన పుట్టినరోజును పురస్కరించుకొని మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్లను బహుకరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్లను బహుకరించిన సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కు రాయపోల్ మండల బిజెపి అధ్యక్షులు మంకిడి స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now