ఘనంగా నవీన్ గుప్త జన్మదిన వేడుకలు.

●ప్రతినిత్యం ప్రజలలో ఉండే నాయకుడు నవీన్ గుప్త…….

●ప్రజాసేవతో పాటు సేవకార్యక్రమాలుఆయన. సొంతం..

●కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి..

●అభిమానుల కోలాహలం మధ్య నవీన్ గుప్త జన్మదిన వేడుకలు..

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో
తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రతినిత్యం ప్రజాసేవలో ఉంటూ తన స్వంత డబ్బులతో సేవ కార్యక్రమాలను చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త ప్రజలలో ఉండే నిజమైన నాయకుడని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, పీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు.

IMG 20240802 WA0112

నవీన్ గుప్త జన్మదిన వేడుకలు గురువారం రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని బర్త్ డే కేకు కట్ చేసి, శాలువాతో సన్మానం చేసి నవీన్ గుప్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడంటేనే పదవులు, పైరవిలని భావిస్తున్న నేటి తరుణంలో తనకు పదవీ లేకున్నా గాని ప్రజాసేవనే ముఖ్యమని తలిచే నవీన్ గుప్త ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. జన్మదినం జరుపుకుంటున్న నవీన్ గుప్త మాట్లాడుతూ తాను నాయకుడిగా ఆలోచించకుండా ఒక సేవకుడిగా అందరికి అందుబాటులో ఉండి పనిచేయడంతోనే తనకు ఆనందం అని ఆయన అన్నారు. తన జన్మదిన వేడుకలలో పాల్గొని ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, అభిమానులకు పేరు, పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now