*నిర్మల్ జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు*
*నిర్మల్ జిల్లా ప్రతినిధి-ప్రశ్న ఆయుధం -డిసెంబర్ 31:-* సంవత్సరాలు తేదీలు మారుతూ వస్తున్నప్పటికీ మనలో మార్పు వచ్చేవరకు ఏ రోజు కూడా మనకు కొత్తగా అనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కరిలో మార్పు మొదలై సాటి మనుషుల్లో మానవత్వాన్ని నింపుకుని సహృదయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జీవితాన్ని గడపాలని అందుకు తేదీ మారినంత మాత్రాన తలరాతలు మారుతాయి అనుకోవడం నిజం కాదని గుర్తించాలి. ఏదేమైనాప్పటికీ మనం చేసే వృత్తికి న్యాయం చేయాలనుకున్నప్పుడు కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని పనిలో నిబద్ధత ఉంటే అనుకున్న అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధమవుతామని తెలుపుటకు సంతోషిస్తున్నామని అందుకు జిల్లా ప్రజలు ఈ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక ప్రకటనలో కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.