Site icon PRASHNA AYUDHAM

ఘనంగా ఆహార దినోత్సవం

IMG 20241221 WA0572

ఘనంగా ఆహార దినోత్సవం

జగదేవపూర్ డిసెంబర్ 21 ప్రశ్న ఆయుధం :

ఎంపీపీఎస్ పాఠశాల వెంకటాపూర్ బీజీ గ్రామం జగదేవపూర్ మండలం సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఆదేశానుసారము పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో ”తెలంగాణ ఆహారోత్సవం”ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఆహార దినోత్సవంలో భాగంగా పిల్లల తల్లిదండ్రులు వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలతో పౌష్టికాహారం తయారుచేసి పాఠశాలలో ప్రదర్శించి దాని గురించి చర్చించిన తర్వాత సహపంక్తి భోజనం పిల్లలతో కలిసి చేయడం వలన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం వలన ఆహార పదార్థాలను ఎలా తయారు చేయాలో దానికి కావలసినటువంటి దినుసులు పదార్థాలు పిల్లలకు తెలియజేయడం వలన అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలతో చర్చించడం వలన పిల్లలకు ప్రత్యక్ష అనుభవంతో పాటు పిల్లలు ఎంతో అనుభూతి పొంది ఆనందంతో తమ సంతోషాలను ఆహార దినోత్సవం కార్యక్రమంలో పాలు పంచుకోవడంజరిగింది. ఇటువంటి ఆహార దినోత్సవాలు అప్పుడప్పుడు జరుపుతున్నట్లయితే పిల్లలందరూ పేరెంట్స్ అందరు సామూహికంగా అందరూ కలిసి తినడం వలన మనమంతా ఒకటే అనే భావన కలుగుతుందని ఐక్యమత్యం పెరుగుతుందని పౌష్టికాహారం గురించి తెలుసుకుంటారని తిండి కలవాడే కండ కలడోయ్ కండ కలవాడే మనిషి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అని ఎప్పుడో గురుజాడ అప్పారావు గారు చెప్పారని అందువలన పిల్లలు అందరూ తమకు అందుబాటులో ఉన్నటువంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే వాళ్లు ఆరోగ్యంగా ఉండి చదువు పైన బాగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉన్నది అని ఇంత ఘనంగా ఆహార దినోత్సవం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దిపేట జిల్లా 2024 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి ఆర్ టి యు జగదేవపూర్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి రాత్లావత్ బొద్దు నాయక్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తుమ్మ స్వప్న, పాఠశాల విద్యా వాలంటరీ స్వరూప హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఏ ఎన్ ఎం సుజాత అంగన్వాడి టీచర్ బోయిని మంగమ్మ, ఆశ కార్యకర్త సునీత పిల్లల తల్లిదండ్రులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పోకల బాబు, చెక్కల సుధాకర్, చెక్కల నరేష్, నీల భాగ్యలక్ష్మి, చెక్కల కవిత, అరిగే మమత, అరిగే భవాని, పోకల శైలజ, అంగన్వాడి ఆయమ్మ చెక్కల లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version