స్వప్నలోక్ లో ఘనంగా గణేష్ నవరాత్రులు

స్వప్నలోక్ లో ఘనంగా గణేష్ నవరాత్రులు

ప్రశ్న ఆయుధం న్యూస్ , సెప్టెంబర్ 14, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈనెల ఏడు నుండి పదిహేను తేదీ వరకు గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిత్య పూజలతో పాటు తీరొక్క పువ్వుతో లక్ష పుష్పార్చన, సహస్ర దీపాలంకరణ మహోత్సవం, కోటి లలితా సహస్ర నామ పారాయణం, 108 రకాల ప్రసాద మహా నైవేద్యం, మోతే గాన బృందం వారిచే భజన కార్యక్రమం, మహిళా మనులతో కుంకుమ పూజలు, తీర్థ ప్రసాదాలు అదేవిధంగా అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమానికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, 12 వ వార్డు కౌన్సిలర్ గోదావరి స్వామి హాజరై వినాయకునికి పూజలు నిర్వహించి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడకల గోవర్ధన్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు పసులాది రాజు, కార్యదర్శి మాలావత్ దశరథ్, కోశాధికారి వజీర్ మారుతి రావు, ఎస్పీఆర్ యాజమాన్యం కొమిరెడ్డి మారుతి, స్వప్నలోక్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, కొవ్వూరి వెంకటేశ్వర శర్మ , శ్రీ హర్ష పంతులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now