*కరీంనగర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు*
– సిపి అభిషేక్ మహంతి
కరీంనగర్ డిసెంబర్ 31:
కరీంనగర్ పోలీసు శాఖ తరపున కరీంనగర్ జిల్లా ప్రజలకు 2025 నూతన సంవత్సర హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.వేడుకల ప్రత్యేకమైన కార్యక్రమాలను లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏదైనా ఎంటర్తైన్మెంట్,ఈవెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సరం తొలిరోజు,ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకొని యువతి యువకులు వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.ప్రధానంగా తల్లిదండ్రులు తమ యుక్తవయసు పిల్లలకు మైనర్ పిల్లలకు బైక్స్ కార్లను ఇచ్చినచో వారు వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం మత్తు నడపడం వలన ప్రమాదాలు జరిగి దాని వలన వారికిగాని,వారివల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈవిషయంలో తల్లిదండ్రులు అప్రమత్తతో ఉండాలి. గ్రామాలలో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు,అతివేగం ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు,త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక తనిఖీ కూడా ఏర్పాటు చేశామన్నారు.నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని సిపి ప్రజానీకాన్ని కోరారు.