ఘనంగా సత్యసాయి 99వ జన్మదిన వేడుకలు

*ఘనంగా సత్యసాయి 99వ జన్మదిన వేడుకలు*

సత్యసాయి 99వ జన్మదినం ను పురస్కరించుకొని బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యసాయి గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులచే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో పుర వీధుల గుండా సత్యసాయి పల్లకి సేవ, శోభాయాత్ర, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నిరుపేద వృద్దులకు నారాయణ సేవ (దుప్పట్ల పంపిణీ) రాత్రి ఉయ్యాల సేవ కార్యక్రమాలతో పాటు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ వెంకటేశ్వర్ రావు, ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, ఉపాధ్యాయుల బృందం సంగ ఎల్లయ్య, భక్తులు పుల్లూరి ప్రభాకర్, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment