Site icon PRASHNA AYUDHAM

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు..!!

IMG 20250503 174125

*ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు..!!_*

బత్తిలి శ్రీనివాసరావు కొమరాడ మండలం తెలుగు రైతు అధ్యక్షులు

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 3 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

1993 నుంచి ఐక్యరాజ్యసమితి మీడియా స్వేచ్ఛపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనావేయడం, దాన్ని పరిరక్షించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం వంటివి పత్రికా స్వేచ్ఛ దినోత్సవ లక్ష్యాలు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ఒక సంఘటన, కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి ప్రజలకు వెల్లడించే ప్రయత్నంలో ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు.

వారి కృషిని అభినందించే ప్రయత్నమే ఈ దినోత్సవ కీలక ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. మీడియా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వతంత్ర స్థితిని అంచనావేయడం, జర్నలిస్టులు, మీడియా నిపుణులను వారి వృత్తి నిర్వహణలో ఎదురయ్యే దాడుల నుంచి రక్షించడం మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. సెన్సార్షిప్, బెదిరింపులు, వేధింపులు, జైలుశిక్ష, హింసవంటి వాటిని ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు అండగా నిలిచి అవగాహన కల్పించడం మరో ముఖ్యవిధిగా నిర్ణయించారు. సత్యాన్వేషణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల జ్ఞాపకాలను మననం చేసుకుని ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా వారికి నివాళి అర్పిస్తారు.

Exit mobile version