నాగారం లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

నాగారం లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 11

నాగారం మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “భారత్ మాతా కీ జై” నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ, సైనికుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, వారికి మద్దతుగా నిలబడటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని తెలిపారు. దేశభక్తి, ఐక్యతను పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని సూచించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని, త్వరలోనే విశ్వగురు స్థానాన్ని సాధిస్తుందని అన్నారు. ప్రధాని మోడీ కృషి, దృఢసంకల్పం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ ర్యాలీలో మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మునిగంటి సురేష్, బోగారం మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, ఇతర జిల్లా, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now