హరిహర వీరమల్లు విజయోత్సవ కేకును కట్ చేసిన *రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు చిన్ని*

మెగాస్టార్ వీరోచిత రక్తతర్పణ మెగా కాంపౌండ్ వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించిన,ప్రథమ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించడమే కాకుండా ఇతరులకు కూడా చూపించాలని,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని ఉద్ఘాటించారు.
విశ్వవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు అన్ని వర్గాల వారిని అలరిస్తూ సూపర్ హిట్ టాక్ లో దూసుకు బోతున్న శుభ సందర్భంగా అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైటీ మెగాస్టార్ వీరాభిమాని కొత్తగూడెం పట్టణ పరమేశ్వరి థియేటర్లో రాత్రి ఫస్ట్ షో ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విజయోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కోనేరు చిన్ని హాజరై తమ సందేశాన్ని అందించి కేకును కట్ చేసి అందరికీ పంచి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలుతెలియజేశారు. కార్యక్రమంలో బి విల్సన్ బాబు, అపరబాలు అల్లి శంకర్,
గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోత్ కృష్ణ, కోనేరు ప్రకీర్త్
ప్రముఖ న్యాయవాదులు గోపికృష్ణ,బాబురావు
పరమేశ్వరి థియేటర్ మేనేజర్ శ్రీనివాస్,పవన్ కళ్యాణ్ వీరాభిమాని మధు,జాన్,సాంబ అభిమానులు,సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now