Site icon PRASHNA AYUDHAM

కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ…!!

IMG 20250610 WA0498

* కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ…!!_

కాళేశ్వరం కమిషన్‌(Kaleshwaram Commission) ఎదుట బీఆర్ఎస్(BRS) కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) విచారణ ముగిసింది.

దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్‌ పీసీ ఘోష్‌(Justice PC Ghosh) ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్‌ కారణాలను తెలుసుకున్నారు. రీడిజైనింగ్‌తో పాటు పలు కీలక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం హరీష్ రావు హుటాహుటిన ఎర్రబెల్లిలోని కేసీఆర్(KCR) ఫామ్‌హౌజ్‌లు వెళ్లారు.

కేసీఆర్‌తో భేటీ అయ్యి విచారణకు సంబంధించిన అంశాలను వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ అనంతరం వీరు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా, విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్‌ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని అన్నారు. ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలిపారు.

Exit mobile version