Site icon PRASHNA AYUDHAM

సోకాల్డ్ పరిపాలనలో గురుకుల విద్యార్థుల భవిష్యత్ అంధకారం హరీశ్ రావు పైర్..

గురుకుల
Headlines in Telugu
“సోకాల్డ్ పరిపాలనలో గురుకుల విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం: హరీశ్ రావు విమర్శ”
“గురుకులాల నిర్వహణలో వైఫల్యం: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం”
హైద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పుణ్యమా అని గురుకుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.గురుకులాల మెయింటెన్స్ విషయంలో రేవంత్ సర్కార్ వైఫల్యం ఫెయిల్ అయ్యిందన్నారు. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.సోకాల్డ్ ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్ ఆందోళన కరంగా మారిందన్నారు. ఆసిఫాబాద్ (డి) వాంకిడి గిరిజిన ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థుల పరిస్థితికి బాధ్యులెవరని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తూ ఓ న్యూస్ ఆర్టికల్‌ను పోస్టు చేశారు.
Exit mobile version