తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సమీక్ష హర్షణీయం: అంకన్నగారి నాగరాజ్ గౌడ్ 

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సమీక్ష హర్షణీయం: అంకన్నగారి నాగరాజ్ గౌడ్

IMG 20240822 WA0064

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించడం విగ్రహ ఏర్పాటు విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీకి చెంపపెట్టు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అమలు చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక కేంద్రమైన సచివాలయ భవనంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా, సగౌరవంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలో మాట్లాడుతూ, ఈ ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేదీ కూడా ప్రకటించారన్నారు డిజైన్లు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

Join WhatsApp

Join Now