భూపాలపల్లి జిల్లాలో హార్వెస్టర్ యజమాని దారుణ హత్య!

*భూపాలపల్లి జిల్లాలో హార్వెస్టర్ యజమాని దారుణ హత్య!*

భూపాలపల్లి జిల్లా: నవంబర్ 28

భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్‌‌ మండలం చండ్రుపల్లిలో ఓ వరికోత మిషన్‌‌ ఓనర్‌‌ను బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

హార్వెస్టర్‌‌ డ్రైవర్‌‌, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల శ్రీకాంత్‌‌గౌడ్‌‌ (25) చండ్రుపల్లిలో మూడు రోజులుగా వరికోత మిషన్‌‌ నడిపిస్తున్నారు. బుధవారం డ్రైవర్‌‌ ప్రదీప్‌‌తో కలిసి వరికోతలు పూర్తి చేసి సాయంత్రం ఆరు గంటల టైంలో మిషన్‌‌ను పక్కన పార్క్‌‌ చేసే సమయంలో… 

ఈ టైంలో కారులో కూర్చొని ఉన్న శ్రీకాంత్‌‌ వద్దకు బైక్‌‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడుతుండగానే శ్రీకాంత్‌‌ను కారులో నుంచి బయటకు లాగి కత్తులతో పొడిచి హత్య చేశారు. గమనించిన డ్రైవర్‌‌ ప్రదీప్‌‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. 

దీంతో భయపడిన అతడు అరుస్తూ గ్రామంలోకి పరుగెత్తాడు. హత్య చేసిన దుండగులు బైక్‌‌పై అన్నారం గ్రామం వైపు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మహదేవపూర్‌‌ సీఐ రాంచందర్‌‌రావు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment